ఉబ్బసము

Article in other languages:

ఉబ్బసము
వర్గీకరణ & బయటి వనరులు
ICD-10 J45.
ICD-9 493
OMIM 600807
DiseasesDB 1006
MedlinePlus 000141
eMedicine med/177  emerg/43
MeSH C08.127.108

ఉబ్బసము (Asthma) ఒక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఇది దీర్ఘకాలంగా మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. ఇది పిల్లలలోను పెద్దవారిలోను కూడా కనిపిస్తుంది. అయితే ఇద్దరిలోనూ కారణాలు వేరువేరుగా ఉంటాయి. ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆయాసం.

ఈ వ్యాధి మూలంగా శ్వాస నాళాలు సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరికి అడ్డుకుంటాయి.[1] అయితే ఇలా జరగడానికి సాధారణంగా వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాలు కారణంగా చెప్పవచ్చును. పొగాకు, చల్లని గాలి, సుగంధాలు, పెంపుడు జంతువుల ధూళి, వ్యాయామం, మానసిక ఆందోళన మొదలైనవి ఇందుకు ప్రధాన కారణాలు. పిల్లలలో జలుబు వంటి వైరస్ వ్యాధులు ప్రధాన కారణము.[2]

ఈ విధమైన శ్వాస నాళాల సంకోచం వలన పిల్లి కూతలు, ఆయాసం, ఛాతీ పట్టినట్లుగా ఉండడం మరియు దగ్గు వస్తాయి. శ్వాస నాళాల వ్యాకోచాన్ని కలిగించే మందులు (Bronchodilators) సాధారణంగా మంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. అయితే తగ్గినట్లుగానే తగ్గి మళ్ళీ తిరిగి వచ్చేయడం ఉబ్బసం యొక్క ప్రధానమైన లక్షణం. ఇందుమూలంగా వీరు మందులకు అలవాటు పడిపోయే ప్రమాదం ఉన్నది. కొంతమందిలో ఈ వ్యాధి ప్రాణాంతకం కూడా కావచ్చును.

అభివృద్ధి చెందిన మరియు చెందుతున్న దేశాలలోని పట్టణ ప్రాంతాలలో ఉబ్బసం వ్యాధి ఎక్కువ అవుతుందని గుర్తించారు. దీని మూలంగా నలుగురిలో ఒకరు పిల్లలు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.[3] అందువలన పట్టణాలలోని వాతావరణ కాలుష్యం నియంత్రించేందుకు ప్రజల్ని జాగృతుల్ని చేయవలసి ఉన్నది.

చేప మందు

ఉబ్బసం వ్యాధికోసం బత్తిన సోదరులు గత కొన్నేళ్ళుగా వేస్తున్న చేపమందుపై నటుడు డాక్టర్ రాజశేఖర్ స్పందించారు. వైద్య శాస్త్రంలో చేప మందువల్ల తగ్గిపోయే జబ్బు ఏదీ లేదని ఆయన అన్నారు. జన్యుపరంగా ఉన్న లోపం కారణంగా కొంతమందికి ఈ వ్యాధి వస్తుందని ,దీనికోసం మూడేళ్ళుగా చేపమందును వాడటం విడ్డూరంగా ఉందని, తన దగ్గరకు వస్తే అరగంటలో నయం చేసి చూపిస్తానని రాజశేఖర్ అన్నారు.

మూలాలు

  1. Asthma: What Causes Asthma. Asthma and Allergy Foundation of America. తీసుకొన్న తేదీ: 2008-01-03.
  2. Zhao J, Takamura M, Yamaoka A, Odajima Y, Iikura Y (February 2002). "Altered eosinophil levels as a result of viral infection in asthma exacerbation in childhood". Pediatr Allergy Immunol 13 (1): 47–50. DOI:10.1034/j.1399-3038.2002.00051.x. PMID 12000498. 
  3. Lilly CM (2005). "Diversity of asthma: evolving concepts of pathophysiology and lessons from genetics". J. Allergy Clin. Immunol. 115 (4 Suppl): S526–31. DOI:10.1016/j.jaci.2005.01.028. PMID 15806035. 

Questions for article:

This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.


IHS Europe: Infrared Heating Systems for Home and Business.