|
Article in other languages:
|
పంజాబ్ (ਪੰਜਾਬ, पंजाब) (Punjab) భారతదేశంలో వాయువ్యభాగాన ఉన్న ఒక రాష్ట్రం. దీనికి ఉత్తరాన జమ్ము-కాష్మీరు, ఈశాన్యాన హిమాచల్ ప్రదేశ్, దక్షిణాన హర్యానా, నైఋతిలో రాజస్థాన్ రాష్ట్రాలున్నాయి. పశ్చిమాన పాకిస్తాన్ దేశపు పంజాబు రాష్ట్రము ఉంది. 'పంజ్' - అంటే ఐదు, 'ఆబ్' - అంటే నీరు. ఈ రెండు పదాలనుండి 'పంజాబు' పదం వచ్చింది. జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ - అనే 5 నదులు పంజాబులో ప్రవహిస్తూ దానిని సశ్యశ్యామలం చేస్తున్నాయి. సారవంతమైన నేల, పుష్కలమైన నీరు, కష్టించే జనులు - వీరంతా కలిసి పంజాబును దేశపు వ్యవసాయంలో అగ్రభాగాన నిలుపుతున్నారు. పారిశ్రామికంగా కూడా పంజాబు మంచి ప్రగతి సాధిస్తున్నది.
ప్రాచీన చరిత్రభారత ఉపఖండంలో వికసించినట్లు కనుగొన్న ప్రధమ నాగరికత సింధునదీ నాగరికత ఈ ప్రాంతంలోనే ఉన్నది. భారతదేశంపై దండెత్తిన పాశ్చాత్యులకు (గ్రీకులు, అరబ్బులు, టర్క్‌లు, ఇరానియనులు, ముఘలులు, ఆఫ్ఘనులు) పంజాబు మొదటి యుద్ధభూమి. కనుక ఆత్మ రక్షణ, పోరాట పటిమ పంజాబీయుల చరిత్రలో అత్యంత ముఖ్యభాగాలైపోయాయి. పోరస్ (పురుషోత్తముడు) అనే రాజుతో యద్ధాన్ని చేస్తున్న గ్రీకు వీరుడు అలెగ్జాండర్ తన తల్లికి వ్రాసిన లేఖలో ఇలా ఉన్నది - నేను సింహాలలాంటి ధైర్యవంతులైన వీరులతో యద్ధం చేస్తున్నాను. నా సైనికులకు ప్రతి అడుగూ ఉక్కులా అడ్డు తగులుతున్నది. నువ్వు ఒకే అలెగ్జాండరుకు జన్మనిచ్చావు. కాని ఇక్కడ ప్రతిఒకడినీ ఒక అలెగ్జాండరు అనవచ్చును[1] విభజన తర్వాత చరిత్ర1947కు ముందు ఒకటిగా ఉండే పంజాబు స్వాతంత్ర్యసందర్భంగా విభజనకు గురైంది. మహమ్మదీయులు ఎక్కువగా ఉన్న (పశ్చిమ) పంజాబు పాకిస్తాను దేశంలో భాగమైంది. సిక్కు, హిందూ మతస్తులు అధికంగా ఉన్న(తూర్పు) పంజాబు భారతదేశంలో ఉన్నది. రాష్ట్ర విభజన పంజాబీయుల జీవితాలలో ఒక చేదు అనుభవంగా మిగిలిపోయింది. మత విద్వేషాలవల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది జనులు కట్టుబట్టలతో ఒక ప్రాంతంనుండి మరొక ప్రాంతానికి వలస పోయారు. [2]
భాషసరిహద్దుకు అటూ, ఇటూ మాట్లాడేది ' పంజాబీ' భాష అయినా లిపులు మాత్రం వేరు. భారతదేశంలో పంజాబీ భాషను 'గురుముఖి' లిపిలో వ్రాస్తారు. పాకిస్తానులో పంజాబీ భాషను 'షాహ్‌ముఖి' లిపి (అరబిక్ లిపినుండి రూపాంతరం చెందినది)లో వ్రాస్తారు. సంస్కృతిపంజాబు సంస్కృతి ఎంతో సుసంపన్నమైనది. పంజాబీయులు తమ సాంఘిక బాధ్యతలకు మంచి విలువలనిస్తారు. మతంభారతదేశంలో హిందువులు మెజారిటీగా లేనటువంటి ఆరు రాష్ట్రాలలో పంజాబు ఒకటి. పంజాబులో దాదాపు 60% ప్రజలు సిక్ఖు మతస్తులు.[3] అమృత్‌సర్‌లో స్వర్ణదేవాలయం అని ప్రసిద్ధమైన హర్‌మందిర్ సాహిబ్ సిక్ఖు మతస్తుల పరమ పవిత్ర స్థలము. సిక్ఖుల తరువాత హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అమమృత్‌సర్‌లో జైన మతస్తులకు కూడా ఒక పవిత్రస్థలము. జిల్లాలు
ఆర్ధిక వ్యవస్థస్థూల ఆర్ధిక స్థితిపంజాబు స్థూల ఆర్ధిక ఉత్పత్తి (మిలియన్ రూపాయలలో, మార్కెట్ ధరల ఆధారంగా) క్రింద ఇవ్వబడింది.భారత ప్రభుత్వ గణాంక విభాగం అంచనా .
ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం 2004లో పంజాబు స్థూల ఉత్పత్తి 27 బిలియన్ డాలర్లు అని అంచనా. మౌలిక సదుపాయాలువ్యవసాయ రంగంలోనూ, పారిశ్రామిక రంగంలోనూ పంజాబు ప్రశంసనీయమైన పురోగతి సాధించింది. మంచి మౌలిక సదుపాయాలు (ముఖ్యంగా రోడ్లు, కకాలువలు, విద్యుత్తు) పంజాబును వ్యవసాయానికి, పరిశ్రమలకు అనువైన రాష్ట్రంగా మలచాయి. పంజాబు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు - రోడ్డు, రైలు, విమాన రవాణా వ్యవస్థ - దేశంలో అత్యుత్తమమైనదని "భారత జాతీయ ప్రాయోగిక ఆర్ధిక పరిశోధనా సంస్థ" (Indian National Council of Applied Economic Research -NCAER) నివేదికలో పేర్కొనబడింది. ఈ సూచిక ప్రకారం భారతదేశపు సగటు 100 పాయింట్లు కాగా పంజాబుకు ఈ విషయంలో 210 పాయింట్లు లభించాయి. అలాగే పంజాబులో సగటు విద్యుత్తు వినియోగం దేశపు సగటుకంటే రెండున్నర రెట్లు ఎక్కువ. 1974 నాటికే పంజాబులో అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కలుగజేయబడింది.
వ్యవసాయంపంజాబు నేల సారవంతమైనది. దానికి తోడు మంచి నీటి వనరులు, ప్రాజెక్టులు, అభివృద్ధిశీలురైన రైతులు పంజాబును వ్యవసాయంలో అగ్రగామిగా చేశారు. గోధుమ ప్రధానమైన పంట. ఇంకా ప్రత్తి, చెఱకు, వరి, జొన్న, ఆవ, బార్లీ వంటి పంటలు, రకరకాల పండ్లు పంజాబులో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు. పంజాబును "భారతదేశానికి ధాన్యాగారం" అంటారు. భారతదేశంమొత్తం గోధుమ ఉత్పత్తిలో 60%, వరి ఉత్పత్తిలో 40% పంజాబునుండే వస్తున్నాయి. ప్రపంచం మొత్తం ఉత్పత్తిలో చూసినట్లయితే 2% గోధుమ, 1% వరి, 2% ప్రత్తి పంజాబులో పండుతున్నాయి. పరిశ్రమలుపంజాబులోని కొన్ని ముఖ్యమైన పారిశ్రామికోత్పత్తులు - విజ్ఞానశాస్త్రీయ పరికరాలు, విద్యుత్‌పరికరాలు, యంత్రభాగాలు, వస్త్రాలు, కుట్టు మిషనులు, క్రీడావస్తువులు, ఎరువులు, సైకిళ్ళు, మోటారు సైకిళ్ళు, ఉన్ని దుస్తులు, చక్కెర, నూనెలు. పర్యాటక రంగంపంజాబులో యాత్రికులను ఆకర్షించే అనేక స్థలాలున్నాయి. - చారిత్రిక స్థలాళు, ప్రకృతి అందాలు, మందిరాలు, నాగరికతానిలయాలు, గ్రామీణ సౌందర్యం, జానపద కళారూపాలు - వీటివలన పర్యాటక రంగం మంచి అభివృద్ధిని సాధిస్తున్నది. కొన్ని పర్యాటక స్థలాలు: విద్యపంజాబులో ఉన్నతవిద్యనందించే సంస్థలు క్రింద ఇవ్వబడ్డాయి. 1960-70 దశకంలో దేశంలో హరితవిప్లవం విజయవంతం కావడానికి పంజాబు వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యమైన పాత్ర వహించింది.
ఇతరాలు1980 దశకంలో ఖలిస్తాన్ అనే ప్రత్యేక సిక్ఖుదేశం కావాలని తీవ్రవాద ఉద్యమం నడచింది. ఈ సమయంలో పంజాబు జీవితం, ఆర్ధిక వ్యవస్థ బాగా అస్తవ్యస్తమైనాయి. క్రమంగా పంజాబు పోలీసులు, భారత మిలిటరీ కలిసి తీవ్రవాద ఉద్యమాన్ని అణచివేశారు. స్వర్ణదేవాలయంలో మకాం వేసిన తీవ్రవాదులను అధిగమించడానికి మిలిటరీ ఆలయంలోకి ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఈ చర్య సిక్ఖుమతస్తులకు తీవ్రమైన మనస్తాపం కలిగించింది. ఇవి కూడా చూడండిమూలాలు
బయటి లింకులు
Questions for article: హిందువులు, map of moga inpunjab in ind |
|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
This article is from Wikipedia. All text is available under the terms of the GNU Free Documentation License.
IHS Europe: Infrared Heating Systems for Home and Business.